హైదరాబాద్ విరించి హాస్పిటల్ వైద్యు ల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సంగీత్ రావ్ అనే వ్యక్తి బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌లో తన చిటికెన వేలుకి ఆపరేషన్ చేయించుకున్నాడు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగీత్ రావ్ మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా విరించి హాస్పిటల్స్ యాజమాన్యం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది. బాధిత కుటుంబసభ్యులు డాక్టర్లను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో గొడవ జరగకుండా విరించి ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.