కొమురంభీం జిల్లా పెంచికల్‌పేట మండలంలో రెండు గ్రామాల ప్రజల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దరోగపల్లి, చెడ్వాయి గ్రామస్తులు మధ్య ఘర్షణ తలెత్తింది. చేపల చెరువులో చేపలు పట్టడం కోసం వివాదం రేగినట్లుగా తెలుస్తోంది.

దీంతో ఇరు గ్రామాల ప్రజలు రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి.. రెండు గ్రామాల ప్రజలపై కేసు నమోదు చేశారు.