కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది పాల పాకిట్ల బ్యాచ్ ఒకటి తయారైంది ఇదివరకు లేకపోతుండె

తెలంగాణలో పాల పాకిట్ల బ్యాచ్ ఒకటి తయారైందని గాయకురాలు, ప్రజా ఉద్యమ నేత విమలక్క ఫైర్ అయ్యారు. ఈ బ్యాచ్ సభ్యులు ఒక జేబులో పాల పాకిట్, ఇంకో జేబులో ఫొటో పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

గొర్లు ఇచ్చినం కదా అని సంతోషపడురి అన్నట్లు వ్యవహరిస్తున్నరు. హక్కులను కాలరాస్తూ గొర్లు, బిల్డింగులు ఇస్తే సరిపోతుందా?

ఏ ప్రకటన వెలువడినా.. జేబులో ఉన్న పాల పాకిట్ కత్తిరించి ఇంకో జేబులో ఉన్న ఫొటోను బయటకు తీసి దానిమీద పాలు పోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ బ్యాచ్ తెలంగాణలోనే పుట్టుకొచ్చిందని మండిపడ్డారు. మీకు ఇంటి సోయి ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏది అమలు కాకపోయినా.. పాల పాకిట్ల బ్యాచ్ కు మాత్రం అదేం పట్టడంలేదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా విమలక్క ఏం మాట్లాడిన్రో ఈ కింది వీడియోలో చూడండి.