భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. దేశ్‌ముఖ్ గ్రామంలో శేఖర్ రెడ్డి పర్యటిస్తుండగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో అభివృద్ది జరగడం లేదంటూ గ్రామస్థులు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిని నిలదీశారు.
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. దేశ్‌ముఖ్ గ్రామంలో శేఖర్ రెడ్డి పర్యటిస్తుండగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో అభివృద్ది జరగడం లేదంటూ గ్రామస్థులు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిని నిలదీశారు. 8 ఏళ్లైనా రోడ్డు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు రాక విద్యార్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు పని పూర్తిచేయాలని.. లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
