నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో  విద్యుత్ అధికారులపై ఆదివారం నాడు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు విద్యుత్ అధికారులు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కామారెడ్డి జిల్లా మద్నూరు  మండలం సోమూరు గ్రామంలో విద్యుత్ శాఖాధికారులు  ఆదివారం నాడు దాడులు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారని కొందరిపై విద్యు శాఖాధికారులు కేసులు నమోదు చేశారు.

ఈ కేసులను నిరసిస్తూ విద్యుత్ శాఖాధికారులను గ్రామస్తులు నిర్భందించారు. అంతేకాదు  వారిపై దాడికి పాల్పడ్డారు.  ఈ విషయం తెలుసుకొన్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో నలుగురు విద్యుత్ శాఖాధికారులు చికిత్స పొందుతున్నారు.

గ్రామస్తుల దాడిలో బిచ్కుంద, జుక్కల్ ఏఈలు, పిట్లం లైన్‌ఇన్స్‌పెక్టర్ తో పాటు మద్నూరు విద్యుత్ శాఖ సిబ్బంది  గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు విద్యుత్ శాఖాధికారులు ఫిర్యాదు చేశారు.