విక్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నాం హెల్త్ బులిటెన్ వెల్లడించిన అపోలో 2.90 లక్షలు చెల్లించాలంటూ ముఖేష్ గౌడ్ కు బిల్ పంపిణీ

విక్రం గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. విక్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బులిటెన్ లో పేర్కొన్నారు. ఆయనకు ప్రస్తుతం ఐసియులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు వైద్యులు. ప్రస్తుతం ఆయనకు నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నారు.

అయితే ఇంకా విక్రం శరీరంలో ఉన్న బుల్లెట్ లను ఇంకా వెలికితీయలేదని వైద్యులు చెప్పారు. విక్రం ఆరోగ్యపై ఆందోళన అవసరం లేదని వారు వెల్లడించారు.

విక్రం వైద్యం కోసం బిల్లు చెల్లించాలంటూ విక్రం తండ్రి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కు బిల్లును పంపిణీ చేశారు అపోలో ఆసుపత్రి యాజమాన్యం వారు.

2లక్షల 90వేల రూపాయలు బిల్ అయినట్లు వెంటనే చెల్లించాలని ముఖేష్ ను కోరింది ఆసుపత్రి యాజమాన్యం.