Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఆంక్షలు గాలికి.. టీఆర్ఎస్ నేత ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు..

అధికార పార్టీ నేతలే లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తన్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో తాజాగా ఇలాంటి ఉదంతం.. చర్చనీయాంశంగా మారింది. 

vikarabad trs leader conducts recording dance programme in lockdown time - bsb
Author
hyderabad, First Published Jun 15, 2021, 11:19 AM IST

అధికార పార్టీ నేతలే లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తన్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో తాజాగా ఇలాంటి ఉదంతం.. చర్చనీయాంశంగా మారింది. 

ఓ వైపు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించి, కఠిన చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు కొందరు మాత్రం మాకు ఇవేం వర్తించవన్నట్టు ప్రవర్తిస్తున్నారు. 

మరీ ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తాము ఈ నిబంధనలకు అతీతం అన్నట్లు భావిస్తూ.. ఆంక్షలను తుంగలో తొక్కుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ టీఆర్ఎస్ నాయకుడు లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి తన ఇంట్లో రికార్డ్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఒకరు లాక్ డౌన్ ఆంక్షలు తుంగలో తొక్కి తన ఇంట్లో అర్థరాత్రి రికార్డు డ్యాన్సులతో హోరెత్తించాడు. వందలమందిని ఆహ్వనించి విందు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులమీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 

లాక్ డౌన్ సందర్భంగా ఆరు దాటితే జనాలను బయటకు అడుగు పెట్టకుండా చూస్తన్న పోలీసులు ఈ విందు-చిందు కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడం మీద సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios