శిరీష ఫోన్ డేటా విశ్లేషిస్తున్నాం: వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం కాలాపూర్ లో శిరీష మృతిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు.
హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం కాలాపూర్ లో శిరీష అనే యువతి మృతి కేసును పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. శిరీష మృతదేహం లభ్యమైన నీటి కుంటను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మంగళవారంనాడు పరిశీలించారు. శిరీష కుటుంబ సభ్యులతో ఎస్పీ కోటిరెడ్డి ఇవాళ సమావేశమయ్యారు.. శిరీష మృతి చెందిన రోజున ఏం జరిగిందనే విషయమై ఎస్పీ కుటుం బసభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పెల్ పోన్ విషయంలో బావతో శిరీష గొడవ పడిందన్నారు.ఈ గొడవ కారణంగానే శిరీష ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.శిరీష ఆత్మహత్య చేసుకుందా , హత్య చేశారా అనే విషయమై విచారణ చేస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు.ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక పూర్తి వివరాలు చెబుతామని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. శిరీష ఫోన్ లోని డేటాను విశ్లేషిస్తున్నామన్నారు.
also read:శిరీష డెడ్ బాడీకి రీపోస్టు మార్టం.. పొంతనలేని సమాధానాలు చెబుతున్న తండ్రి...
ఈ నెల 11వ తేదీన శిరీష మృతి విషయం వెలుగు చూసింది. అంతకుముందు రోజే ఇంట్లో గొడవ పడి శిరీష బయటకు వచ్చింది. శిరీష మృతదేహంపై ఉన్న గాయాలతో ఆమెను హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడ వ్యక్తమయ్యాయి,