హైదరాబాద్: మాజీ మంత్రి చంద్రశేఖర్ సోమవారం నాడు బీజేపీలో చేరారు.  ఈ సందర్భంగా వికారాబాద్ లో నిర్వహించిన  సభలో మాజీ మంత్రి చెప్పిన జోకులతో సభ మొత్తం నవ్వులతో నిండిపోయాయి.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చంద్రశేఖర్ ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీ ముఖ్య నేతల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.కేసీఆర్ ఇంట్లో తన బావమరిది పనిచేస్తారని చంద్రశేఖర్ చెప్పారు. కేసీఆర్ ఇంట్లో చోటు చేసుకొన్న  ఘటనను  తన బావమరిది తనకు చెప్పారని చంద్రశేఖర్ తెలిపారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తుండడం కేసీఆర్ కు కంటి మీద కునుకు కూడ లేకుండా చేస్తోందని చెప్పారు.నిద్రలో కూడ బండి సంజయ్ పేరును కలవరిస్తున్నాడని ఆయన చెప్పారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పిన మాటలను విని  సభికులంతా నవ్వారు.