స్ధానిక ఎన్నికల్లో చావో రేవో అనేలా కాంగ్రెస్ పోరాడుతోందని విజయశాంతి అన్నారు. యూపీఏలో టీఆర్ఎస్‌ చేరబోతోందని చెబితే కాంగ్రెస్‌ కన్నా టీఆర్‌ఎస్‌కు ఓటేయడం మేలని ప్రజలు భావించే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. 

హైదరాబాద్: తమ పార్టీ సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు నేత విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేసేలా ఉన్నాయని ఆమె అన్నారు. 

స్ధానిక ఎన్నికల్లో చావో రేవో అనేలా కాంగ్రెస్ పోరాడుతోందని విజయశాంతి అన్నారు. యూపీఏలో టీఆర్ఎస్‌ చేరబోతోందని చెబితే కాంగ్రెస్‌ కన్నా టీఆర్‌ఎస్‌కు ఓటేయడం మేలని ప్రజలు భావించే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. 

జగ్గారెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య రహస్య అవగాహన ఉందని ప్రజలు అనుమానించే పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌, వైసీపీ మద్దతు లేకుండా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనే కేసీఆర్‌ మాటలను జగ్గారెడ్డి నమ్ముతున్నారేమోనని ఆమె అన్నారు.