మెదక్: గెలిచినా ఓడినా మెదక్ తన సొంత ఇంటిలాంటిదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి స్పష్టం చేశారు. గెలుపు ఓటములు తనకు మామూలేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేసేందుకు కేసీఆర్ దొర కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లినా ఏమీ కాదన్నారు. కేసీఆర్ మోడీ మనిషి అంటూ విమర్శించారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కుట్ర చేసి ఓడించారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ బంగారు తెలంగాణ కాగలదని విజయశాంతి స్పష్టం చేశారు.