లండన్: విజయ్ మాల్యాను  ఇండియాకు అప్పగించాలని  బ్రిటన్ కోర్టు  సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. రూ.9 వేల కోట్లు బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన కేసుల్లో మాల్యా బ్రిటన్‌లో తలదాచుకొంటున్నాడు.

ఇండియా నుండి పారిపోయిన విజయ్ మాల్యా లండన్‌లో తలదాచుకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై తమకు అప్పగించాలని  బ్రిటన్‌ కోర్టులో  సీబీఐ అధికారులు ఎస్. సాయి మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై బ్రిటన్ కోర్టులో సోమవారం నాడు తుది తీర్పును ఇచ్చింది. 62 ఏళ్ల విజయ్ మాల్యా దేశంలోని పలు బ్యాంకుల నుండి  రూ.9వేల కోట్లను ఎగ్గొట్టాడు.  
2016 మార్చి2వ తేదీన లండన్‌‌కు పారిపోయాడు.

విజయ్ మాల్యా వాస్తవాలను వక్రీకరించారని బ్రిటన్ కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విషయమై అప్పీల్ చేసుకోవడానికి మాల్యాకు 14 రోజుల గడువును కోర్టు ఇచ్చింది.