వర్క్ ఫ్రం పేరుతో రూ. 30 కోట్ల మోసం: హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు
డిజిటల్ ఇండియా ప్రైవేట్ ఇండియా సంస్థ నుండి తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరుతూ బాధితులు సీసీఎస్ పోలీసులక ఫిర్యాదు చేశారు. సుమారు వెయ్యి మంది బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు.
హైదరాబాద్: Digital ఇండియా ప్రైవేట్ పేరుతో వెయ్యి మంది నుండి సుమారు రూ. 30 కోట్లు వసూలు చేసి డబ్బులు చెల్లించడం లేదు. దీంతో బాధితులు Hyderabad CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ ఏడాది జూన్ 15 నుండి తమకు రావాల్సిన వేతనాలు రావడం లేదని బాధితులు తెలిపారు. దీంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తాము ఇచ్చిన పుస్తకాలను స్కాన్ చేసి తాము చెప్పినట్టుగా చేస్తే డబ్బులు చెల్లిస్తామని ప్రచారం చేసింది.
ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురు బాధితులు ఈ సంస్థ నమ్మినట్టుగా చేశారు. ఐదు వేల పేజీలు, పదివేల పేజీల పేరుతో స్లాట్లను విభజించారు. ఆయా స్లాట్లకు అనుగుణంగా డబ్బులు వసూలు చేశారు. రూ. 50 వేలు, రూ.1 లక్షల, రూ. 3 లక్షలు, రూ. ఐదున్నర లక్షలను డబ్బులు వసూలు చేసినట్టుగా బాధితులు చెప్పారు. డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు ఇచ్చిన పుస్తకాలు స్కాన్ చేసి తిరిగి సంస్థకు పెన్ డ్రైవ్ రూపంలో ఇస్తే డబ్బులు ఇచ్చేవారు.ఈ ఏడాది జూన్ 13 నుండి తమకు డబ్బులు రావడం లేదని బాధితులు చెప్పారు. ఈ సంస్థకు చెందిన అమిత్ శర్మ, విజయ్ ఠాగూర్ లు తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని బాధితులు చెబుతున్నారు.
నెల రోజులుగా డబ్బులు రాకపోవడంతో బాధితులు ఇవాళ హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్క్ ఫ్రం హోం పేరుతో తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు.ఈ విషయమై బాధితులు మీడియాతో మాట్లాడారు. తమకు చెల్లించాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని బాధితులు నిర్వాహకులను కోరుతున్నారు. ఈ విషయమై ప్రముఖ మీడియా చానెల్స్ కథనాలు ప్రసారం చేశాయి. బాధితుల ఇంటర్వ్యూలను మీడియా చానెల్స్ ప్రసారం చేశాయి.
ఇంగ్లీష్ నవలలు, అంతర్జాతీయ పుస్తకాలను స్కాన్ చేస్తే డబ్బులు చెల్లించేవారు. ఆయా స్లాట్లలో చేరిన వారికి పేజీకి ఐదు రూపాయాల చొప్పున డబ్బులు చెల్లించేవారు. అమీర్ పేట, జూబ్లీహిల్స్ లలో సంస్థలు తెరిచారు. తమకు ఈ సంస్థ ద్వారా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందని భావించిన బాధితులు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టి పుస్తకాలు స్కాన్ చేసి ఇచ్చేవారు. డిజిటల్ వైపు ప్రపంచం నడుస్తుందని అందుకే పుస్తకాలను స్కాన్ చేసే ఈ పథకంలో బాధితులు చేరారు.