ఒక రైతు కుమారుడినైన తనను ఈ స్థాయికి తెచ్చింది గురువులేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తన కుటుంబంలో ఎవరూ పాఠశాల విద్య తర్వాత చదవలేదని.. తనను గురువులే గైడ్‌ చేశారని.. వారందరికీ ఉప రాష్ట్రపతి ధన్యవాదాలు అని చెప్పారు. 


ఒక రైతు కుమారుడినైన తనను ఈ స్థాయికి తెచ్చింది గురువులేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ అక్రిడేటెడ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాతీయ సదస్సులో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన కుటుంబంలో ఎవరూ పాఠశాల విద్య తర్వాత చదవలేదని.. తనను గురువులే గైడ్‌ చేశారని.. వారందరికీ ఉప రాష్ట్రపతి ధన్యవాదాలు అని చెప్పారు. 

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గొప్ప వ్యక్తి అని పేర్కొంటూ ఆయన సేవలను ఉపరాష్ట్రపతి స్మరించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. గురువులు చూపిన మార్గంలో నడవటమే వారికి ఇచ్చే గొప్ప దక్షిణ అని వెంకయ్య నాయుడు అన్నారు. భారతీయ చరిత్రలో గురుశిష్యుల సంబంధానికి గొప్పల విలువ ఉందని.. ప్యాషన్‌తో టీచర్‌ వృత్తిని నిర్వహించాలని వెంకయ్య నాయుడు ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సదస్సులో కొవిడ్‌ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అపోలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి, ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్‌ నాగేశ్వర్‌రెడ్డి, కిమ్స్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.