మాదాపూర్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఆక్వా అక్వేరియా ఇండియా-2019 సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్ధ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది.

ఈ సదస్సుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఏపీ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, బండ ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారత్ సహా ఆసియా దేశాల నుంచి ప్రముఖ మత్స్య, వ్యాపార, పరిశోధన సంస్థలు సుమారు 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు.