Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మా పార్టీకి పూర్వవైభవం: వీహెచ్

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంతరావు స్పందించారు. ఇర పార్టీల్లోని ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయడానికి కేసీఆర్ కుట్రలు పన్ని తమ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంటున్నారని అన్నారు. 
 
vh respond on congress mlas trs joining
Author
Hyderabad, First Published Mar 11, 2019, 1:46 PM IST

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంతరావు స్పందించారు. ఇర పార్టీల్లోని ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయడానికి కేసీఆర్ కుట్రలు పన్ని తమ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంటున్నారని అన్నారు. 

అయితే కేసీఆర్ రాజకీయాలు మరెన్నో రోజులు సాగవని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ గా వున్న కేటీఆర్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు వస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్ సీఎం పదవి చేపడితే ఎమ్మెల్యేలందరు తిరిగి తమ పార్టీలోకి వలస వస్తారని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. 

ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వలస పోవడంలో తమ పార్టీ వైఫల్యం కూడా వుందన్నారు. దీనిపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్కలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని...తమ సమస్యలను ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని వీహెచ్ సలహా ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios