న్యూఢిల్లీ: హైద్రాబాద్ పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం పున:ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్  గురువారం నాడు  న్యూఢిల్లీలో దీక్షకు దిగారు.

హైద్రాబాద్ పంజగుట్ట సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఈ విగ్రహన్ని తిరిగి అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని  కోరుతూ వి. హనుమంతరావు కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే  ఇవాళ న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ లు దీక్షకు దిగారు..  ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విగ్రహాన్ని  తెలంగాణ ప్రభుత్వం ఈ విగ్రహన్ని తొలగించిందని  వి. హనుమంతరావు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.