రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు తమ వారసులను రంగంలోకి దించి ముందస్తు ఎన్నికలబరిలో దిగుతారని తెలిపారు.

రాజకీయ నేతల భవిష్యత్తుపై తరచుగా జోస్యాలు చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వేణుస్వామి ఈసారి తెలుగు రాష్ట్రాలపై జోస్యం చెప్పారు.

గతంలో ఆయన చెప్పిన చాలా మంది రాజకీయనేతల జోస్యాలు నిజమయ్యాయని సోషల్ మీడియా టాక్.

2014 ఎన్నికలు, దక్షణాది రాష్ట్రంలో ఓ ముఖ్యమంత్రి మరణం ఆయన చెప్పినట్లే జరిగాయని చాలా మంది చెబుతుంటారు. అందుకే ఆయన జోస్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈసారి ఆయన తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై జోస్యం చెప్పారు. ఏపీ, తెలంగాణలో 2018లోనే ఎన్నికలు రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు తమ వారసులను రంగంలోకి దించి ముందస్తు ఎన్నికలబరిలో దిగుతారని తెలిపారు.

తాను రాజకీయ విశ్లేషణలు చేయడంలేదని, కేవలం జ్యోతిషంరిత్యా జరగబోయే విషయాన్ని మాత్రమే చెబుతున్నాని క్లారటీ ఇచ్చారు.

మరీ ఆయన చెప్పినట్లే ముందస్తు ఎన్నికలకు తెలుగు రాష్ట్రాలు వెళుతాయా... లేదా అనేది 2018 వస్తే కానీ చెప్పలేం.