హైదరాబాద్: తెలంగాణ  రాష్ట్రంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలుగు యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వీరేందర్ గౌడ్ టీడీపీకి గుడ్ బై చెప్పారు.ఆయన త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడే  వీరేందర్ గౌడ్. సోమవారం నాడు వీరేందర్ గౌడ్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవికి  రాజీనామా  చేశారు.ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నారు.

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కూడ బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, దేవేందర్ గౌడ్ మాత్రం బీజేపీలో ఇప్పట్లో చేరే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దేవేందర్ గౌడ్ బీజేపీ గూటికి చేరే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

దేవేందర్ గౌడ్ తో  బీజేపీ కీలక నేతలు సమావేశమైనట్టుగా గతంలో ప్రచారం సాగింది. ఈ తరుణంలో దేవేందర్ గౌడ్  బీజేపీలో చేరుతారని అనుకొన్నారు. కానీ, దేవేందర్ గౌడ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నారని  సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  వీరేందర్ గౌడ్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014 ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయాడు.