హైదరాబాద్‌: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు జగన్నాథం గౌడ్. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందారు.  జగన్నాథం గౌడ్ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇక జగన్నాథం గౌడ్ మృతి పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా జగన్నాథం కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఆయన మరణంతో వరంగల్ జిల్లా మంచి నాయకున్ని కోల్పోయిందని ఆవేధన వ్యక్తం చేశారు.