ఆర్ఎస్ఎస్ నేతలను కాపాడడానికే నాపై కుట్రలు, ఇది ప్రధాని మోదీ వ్యూహరచన : వరవరరావు

Varavara Rao Responds on PM Narendra Modi Assassination Plan letter
Highlights

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమైన ప్రజాసంఘాల నేతలు

ఆరెస్సెస్ నేతలను కాపాడడానికే తనపై అసత్య ప్రచారం, కుట్రలు జరుగుతున్నాయని విరసం నేత వరవరరావు అన్నారు. ఈ కుట్రలకు ప్రధాని మోదీ వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాసంఘాల ఆద్వర్యంలో ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి వరవరరావుతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్, చీకూడి ప్రభాకర్ హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మావోయిస్టు ఉద్యమాన్ని బలహీన ప్చడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిపారన్న వార్తలు ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని టార్గెట్‌ చేయడానికేనని వరవరరావు వ్యాఖ్యానించారు. 

ప్రధాని హత్యకు కుట్ర లేఖలో తన పేరు ఉండటంపై వరవరరావు ఈ స్పందించారు. ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని తాను అనుకోవడం లేదన్నారు. జాకబ్‌ విల్సన్‌ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ లేఖే పెద్ద మోసమని ఆయన అన్నారు. రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాడుతున్న తనను, విల్సన్ ను అరెస్టు చేయడం కోసమే ఈ కుట్ర జరిగిందని వరవరరావు ఆరోపించారు.
 
ఈ లేఖ విషయంలో మీడియా కూడా అతిగా వ్యవమరిస్తోందని వరవరరావు మండిపడ్డారు. రిపబ్లిక్, టైమ్స్ నౌ లాంటి చానెళ్ల తో పాటు పలు తెలుగు చానెళ్లు కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా విల్సన్ వద్ద దొరికిన లేఖను యధాతదంగా చూపింంచాలని, అప్పుడు అసలు విషయాలు ప్రజలకు అన్థమవుతాయని అన్నారు. 

అయినా సెంట్రల్ కమిటీ మెంబర్ మిలింద్ లాంటి వ్యక్తి ఇంత బాద్యతారాహిత్యమైన లేఖ రాయడని వరవరరావు అన్నారు. అందులో తనను మహాన్ నేతగా సంభోదించడాన్ని బట్టే తెలుస్తుంది అది మావోయిస్టుల లేఖ కాదని. తనను ఎప్పుడు, ఎవరూ మహాన్ నేత అని సంభోదించరని అన్నారు. ఇవన్ని పరిశీలిస్తే ఆ లేఖలు ఎవరో తప్పుడు ప్రచారం కోసం సృష్టించినవని అర్థమవుతుందని వరవరరావు తెలిపారు. 

ఎల్గార్ సంస్థ పుణెలోని శనిగార్ వాడ లో గత సంవత్సరం డిసెంబర్ 31 బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఓ మీటింగ్ ఏర్పాటుచేశారు. అందులో పాల్గొన్న వారిపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు దళితులు చనిపోయారు. ఈ ఘటనకు కారణమైన ఆర్ఎస్ఎస్ నేతలు శంబాజీ బిడే, మిలింద్ ఎక్ బోటే లను కాపాడడానికే ప్రధాని ఈ కుట్రలకు తెరలేపారని వరవరరావు ఆరోపించారు. 

loader