వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామస్తులు అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు రాజేందర్‌కే వేస్తామంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు.

గ్రామానికి చెందిన సుమారు 400 మంది రజకులు హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను ఈటలకు ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈటల చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తామంతా ఆకర్షితులయ్యామని ఆయనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామస్తులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

"