హైదరాబాద్ వనస్థలిపురంలో మంగళవారం యాక్సిస్ బ్యాంక్ వద్ద రూ. 70 లక్షల చోరీ కేసులో దోపిడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. వీరిని తమిళనాడుకు చెందిన రాంజీనగర్ గ్యాంగ్‌గా గుర్తించారు.

ఐదుగురు సభ్యుల ఈ ముఠాపై గతంలో బెంగళూరు, చెన్నైలలో పలు చోరీ కేసులు నమోదైనట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. అలాగే పలు ఏటీఎంల దగ్గర సైతం ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడినట్లుగా తేల్చారు. వనస్థలిపురంలో బ్యాంక్ దోపిడి అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.