Asianet News TeluguAsianet News Telugu

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య .. టీఆర్ఎస్‌ నుంచి వనమా రాఘవ సస్పెండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక నిందితుడిగా వున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 
 

vanama raghava suspended from trs party
Author
Hyderabad, First Published Jan 7, 2022, 2:21 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక నిందితుడిగా వున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రామకృష్ణ ఆత్మహత్య తర్వాత రాఘవ రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసులో తనకెలాంటి సంబంధం లేదని.. కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా palvanchaలో కుటుంబం suicide చేసుకున్న ఘటనలో నిందితుడు vanama raghavendra rao ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అతడిని ఇప్పటి వరకు పోలీసులు arrest చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే కుమారుడు కావడంతోనే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రాఘవపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ తో కొత్తగూడెం బందును కొనసాగిస్తున్నారు.

తన కుమారుడిని అప్పగిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పినా.. ఇప్పటి వరకు రాఘవ పోలీసుల ఎదుటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి notices అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల లోపు రావాలని అందులో పేర్కొన్నారు. మణుగూరు ఎస్పీ శబరీష్ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు. అసలు వనమా రాఘవ తమకు దొరకలేదని  కొత్తగూడెం పోలీసులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. రాఘవ కోసం ఏడేనిమిది బృందాలుగా ఏర్పడి తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పి రోహిత్ రాజు వెల్లడించారు. వనమా దొరికితే కస్టడీలోకి తీసుకుంటామన్నారు. Vanama Raghava పై గతంలో నమోదైన కేసులు ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు ఆధారాలు లభిస్తే Rowdysheet నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

నాగ రామకృష్ణ కుటుంబం Suicide వ్యవహారంలో రాఘవేంద్రరావు హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేసినట్లు Social mediaలో వైరల్ అయ్యింది. ఆత్మహత్యకు ముందు Ramakrishna తీసుకున్న Selfie video చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే Vanama Venkateswara Rao స్పందిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు  లేఖరాశారు. తన కుమారుడు పై రామకృష్ణ ఆరోపించిన నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. రాఘవను పోలీసుల విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే స్పందించిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్ లో రాఘవను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఈ నెల 3 వ తేదీన  పాల్వంచలో  రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. అదే రోజున రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి తో పాటు పెద్ద కూతురు  సాహిత్య మరణిచారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కూతురు సాహితీ బుధవారం నాడు మరణించింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు ముందు తీసిన సెల్పీ వీడియోలో వనమా రాఘవేందర్ తనతో వ్యవహరించిన తీరును రామకృష్ణ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios