Asianet News TeluguAsianet News Telugu

వామన్ రావు దంపతుల హత్య కేసు: చంపి, రాత్రంతా కారులోనే నిద్రపోయి...

వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేుసు రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇద్రిని చంపిన తర్వాత నిందితులు కారులో రాత్రంతా నిద్రపోయినట్లు తెలిసింది.

Vaman Rao murder case: Accused escaped to Maharashtra
Author
Manthani, First Published Feb 24, 2021, 7:31 AM IST

పెద్దపల్లి: న్యాయవాది వామన్ రావు దంపతులను హత్య చేసిన తర్వాత నిందితులు ఏమీ జరగనట్లే అక్కడి నుంచి జారుకున్నట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. ఆ రాత్రికి వారు కారులోనే నిద్రపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో పోలీసులు మంథని కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఈ రిపోర్టులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 

వామన్ రావు, నాగమణి దంపతులలు కల్వచరల వద్ద నడిరోడ్డుపై నరికి చంపిన తర్వాత నిందితులు కారులో సుందిళ్ల బ్యారేజీ చేరుకున్నారు. హత్యకు వాడిన కత్తులను, రక్తం అంటిన దుస్తులను బ్యారేజీలో పడేశారు. అక్కడి నుంచి కారులో వారు వాంకిడి చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. రాత్రంతా కారులోనే నిద్రపోయారు. 

వ్యక్తిగత కక్షలే వామన్ రావు దంపతుల హత్యకు కారణమని భావిస్తున్నారు. కుంట శ్రీనుపై ఉన్న కేసుల గురించి, ఫిర్యాదుల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వామన్ రావుతో పలుమార్లు గొడవ జరిగింది. కుంట శ్రీను బెదిరించడంతో వామన్ రావు హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంథని పోలీసు స్టేషన్ లో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు. 

గుండపడుగు గ్రామం బస్టాండ్ వద్ద కుంట శ్రీను స్థలాన్ని కొని భవనాన్ని, దాని సమీపంలోనే గుడిని నిర్మించడానికి పూనుకున్నాడు. దాంతో పాటు రాధా గోపాలస్వామి ఆటలయానికి కమిటీ ఏర్పాటు చేశాడు. వాటన్నింటినీ అడ్డుకునేందుకు వామన్ రావు కేసులు వేశాడు. దీంతో వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది.

వామన్ రావు గురించి బిట్టు శ్రీనుతో పలుమార్లు కుంట శ్రీను మాట్లాడాడు. చివరకు ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. గుంజపడుగు గ్రామంలో ఈ నెల 17వ తేదీన జిరగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కుటుం శ్రీను, ఆ తర్వాత దుబ్బపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యాడు. మంథని చౌరస్తాకు వచ్చే సరికి వామన్ రావు దంపతులు కారులో మంథని కోర్టుకు వెళ్తుండడం కనిపించింది. ఆ విషయాన్ని వెంటనే బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పాడు. బిట్టు శ్రీను కత్తులను, కారును డ్రైవర్ చిరంజీవితో పంపించాడు. కోర్టు వద్ద లచ్య, కుమార్ లను రెక్కీ కోసం ఏర్పాటు చేశాడు. 

హత్యలుజరిగిన ఈ నెల 17వ తేీదన కుటుం శ్రీను, బిట్టు శ్రీను, లచ్చయ్య, అక్కపాక కుమార్ ల మధ్య మొత్తం 18 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. బిట్టు శ్రీను, కుంట శ్రీను మద్య 11 సార్లు, కుటుం శ్రీను - పూదరి లచ్చయ మధ్య ఐదు సార్లు సంభాషణలు జరిగాయి. బిట్టు శ్రీను, కుంట శ్రీను చెరోసారి కుమార్ తో మాట్లాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios