మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్  హైద్రాబాద్‌లో జరిగిన   డాక్టర్ హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.  అయితే వాస్తవానికి ఈ కార్యక్రమంలో వాజ్‌పేయ్ అనుకోకుండా పాల్గొన్నారు.


హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ హైద్రాబాద్‌లో జరిగిన డాక్టర్ హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అయితే వాస్తవానికి ఈ కార్యక్రమంలో వాజ్‌పేయ్ అనుకోకుండా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో వాజ్‌పేయ్ పాల్గొనడంతో నిర్వాహకులు ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు.

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ 1980లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1996 వరకు వాజ్‌పేయ్ బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాడు. 1980లో వాజ్‌పేయ్ బెంగుళూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు విమానంలో బయల్దేరాడు.

అయితే బెంగుళూరు వెళ్లే విమానం హైద్రాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దిగింది. అదే రోజున హైద్రాబాద్‌లో బీజేపీ నేతలు డాక్టర్ హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 

ఈ విషయం వాజ్‌పేయ్‌కు తెలిసింది. వెంటనే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుండి ట్యాక్సీ తీసుకొని డాక్టర్ హేగ్డేవార్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించే ప్రదేశానికి చేరుకొన్నారు. 

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీజేపీ నేతలు తమ కార్యక్రమంలో అనుకోని అతిథిగా వాజ్‌పేయ్ పాల్గొనడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత వాజ్‌పేయ్ హైద్రాబాద్ నుండి బెంగుళూరుకు తిరిగి వెళ్లారు.