'ఆయన ఆంధ్రకి వెళ్తే మంచిది..': కేవీపీకి వీహెచ్ స్ట్రాంగ్ వార్నింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు .
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారాయి. తనని కనీసం సగం తెలంగాణవాడిగానైనా గుర్తించాలంటూ కేవీపీ కోరారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. తాను దశాబ్దాలుగా తెలంగాణలోని ఉంటున్నారని తనకిక్కడే ఓటు హక్కు ఉందని తెలిపారు. తనని తెలంగాణలో కలుపుకోండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. చివరకు తాను తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని కేవీపీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాను తెలంగాణకు చెందిన వాడినేనని.. తనను ఆంధ్రా వాడు అనుకోవద్దని, తన ఓటు కూడా తెలంగాణలోనే ఉందనీ విహెచ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని.. కాబట్టి కేవీపీ ఆంధ్రకు వెళ్లి పని చేస్తే బాగుంటుందని సూచించారు.
.
ఇటీవల జరిగిన ‘రైతే రాజైతే…’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కేవీపీతోపాటు రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. అదే వేదికపై కేవీపీపై మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్దంలో వైఎస్సార్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే అంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని నేతలే ఒకరూ సపోర్టు చేస్తూ.. మరొకరూ విమర్శించడంతో కేవీపీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.