Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి సెగలు

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కారు జోరుకు కుదేలయిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మెుదలైంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేందుకు రెడీఅవుతున్నారు. పార్టీ పోస్టుమార్టం ఎలా ఉన్నా కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే పోస్టుమార్టం చేస్తున్నారు. ఓటమిపై గల కారణాలను విశ్లేషించి అధిష్టానంకు ఫిర్యాదు చేసేందుకు క్యూకడుతున్నారు. 

Utttam Kumar Reddy to face criticism
Author
Hyderabad, First Published Dec 14, 2018, 5:25 PM IST

ఢిల్లీ: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కారు జోరుకు కుదేలయిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మెుదలైంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేందుకు రెడీఅవుతున్నారు. పార్టీ పోస్టుమార్టం ఎలా ఉన్నా కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే పోస్టుమార్టం చేస్తున్నారు. ఓటమిపై గల కారణాలను విశ్లేషించి అధిష్టానంకు ఫిర్యాదు చేసేందుకు క్యూకడుతున్నారు. 

ఇప్పటికే ఆ కోవలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో శుక్రవారం భేటీ అయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఆమెకు వివరించారు. 

తెలంగాణ రాష్ట్రంలో పీసీసీని పునర్వ్యవస్థీకరించాలంటూ సోనియాగాంధీకి సూచించారు. అలాగే తెలంగాణలో సెంటిమెంట్‌ కారణంగా ప్రజాకూటమి ఓటమి పాలైందని పొంగులేటి నివేదిక సమర్పించారు. 

స్థానికంగా టీడీపీతో పొత్తు వికటించిందని పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని సోనియాగాంధీకి  విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో మరింత నష్టపోతామని చెప్పారు. పొంగులేటి సూచనలపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. 

పొంగులేటి సుధాకర్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల విషయంలో అయితేనేమీ, ముందస్తు ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, పొత్తులు, ఎన్నికల కమిటీలపై ఆయన అసహనంతో ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేశారు.

మెుత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మెుదలైందని చెప్పుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలనే ప్రతిపాదనలతో కొందరు ఢిల్లీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యనే గెలిపించుకోలేకపోయారని అలాంటి వ్యక్తి ఇక రాష్ట్రంలో పార్టీని ఏం గెలిపిస్తారంటూ కొందరు బాహటంగానే ఉత్తమ్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఉత్తమ్ పై ఫిర్యాదులు చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నేత పదవి కోసం లాబీయింగ్ చేసుకునే పనిలో పడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios