హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన భార్య పద్మావతి ఆర్య సమాజ్ లో ఆదర్శ వివాహం చేసుకున్నామని తెలిపారు. కావాలనే సంతానం వద్దనుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు. 

అయితే తాము వికలాంగుడిని దత్తత తీసుకోవాలనుకున్నామని అయితే అది కుదరలేదని తెలిపారు. తాము సంపాదించిన ఆస్తంతా  కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకే ఇస్తామని తెలిపారు. తనకు తన నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలే పిల్లలని ఉత్తమ్ తెలిపారు.