Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ రాజీనామా: సీఎల్పీ విలీనంపై టీఆర్ఎస్ వ్యూహరచన

ఉత్తమ్ రాజీనామా చేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి వెంటనే సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం.  

 

uttam kumar reddy resignedd mla post,trs Strategy on clp merger
Author
Hyderabad, First Published Jun 6, 2019, 10:19 AM IST

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ  కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేసేందుకు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పావులు కదుపుతుందని తెలుస్తోంది. 

బుధవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం విలీనానికి ముహూర్తం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఉత్తమ్ రాజీనామాతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 18కు తగ్గింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తమ్ రాజీనామాతో 19 కాస్త 18కి తగ్గింది

18 మంది ఎమ్మెల్యేలలో 11 మంది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోగా 7 మంది మాత్రమే మిగిలారు. వారిలో మరో నలుగురు టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్‌ రోహిత్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

వరంగల్ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కూడ టీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది. మెుత్తం ముగ్గురు టీఆర్ఎస్ పార్టీలో చేరితో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా గల్లంతు కానుంది. 

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసేందుకు అధికార పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, గండ్ర వెంకటరమణరెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, జాజుల సురేందర్ , హర్షవర్ధన్ రెడ్డిలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. వారి సరసన పైలట్ రోహిత్ రెడ్డితోపాటు మరో ముగ్గురు చేరనున్నట్లు తెలుస్తోంది. 

ఉత్తమ్ రాజీనామా చేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి వెంటనే సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios