గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడాన్ని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు బట్టారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.హైద్రాబాద్ లో నిర్వహించిన CLP సమావేశంలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ఈ సమావేశంలో తన ప్రసంగం ముగిసిన తర్వాత Uttam Kumar Reddy మీడియాతో మాట్లాడారు.

కర్ణాటక అసెంబ్లీతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో నిర్ణీత సమయాని కంటే ముందే ఎన్నికలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతలు హైద్రాబాద్ ను వదిలి నియోజకవర్గాలకు వెళ్లాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

:గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు బట్టారు. KCR అహంకార ధోరణి కారణంగానే Governor ప్రసంగం లేకుండా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.కేసీఆర్ తీరును తాను ఖండిస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగ సంప్రదాయాలను తుంగలో తొక్కడం సరైంది కాదన్నారు.

ఈ విషయాన్ని తాను పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని చెప్పారు. dalitha bandhuపథకాన్ని దళితులకు అందించడం కోసం కనీసం ఈ బడ్జెట్ లో 85 వేల కోట్లు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దళిత బంధు పథకం కింద లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

రాష్ట్రంలో మహిళా సంఘాలన్నింటికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.నిరుద్యోగ భృతి గురించి ఏడాది క్రితం చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజా పంపిణీ ద్వారా సన్న బియ్యం సరఫరా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Andhra Pradesh రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. అయినా కూడా ఈ విషయమై Telangana ప్రభుత్వం ఎందుకు Supreme Court ను ఆశ్రయించడం లేదో చెప్పాలని ఆయన కోరారు. తెలంగాన నుండి అక్రమంగా ఏపీ ప్రభుత్వం నీటిని దోచుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కేసీఆర్ ఎందుకు అడ్డుకోవడం లేదో అసెంబ్లీలో చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నెల 7వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే తొలుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలుత గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత పొరపాటున ఈ సమాచారం పంపారని గవర్నర్ Tamilisai Soundararajan వివరించారు.

కొంత కాలంగా గవర్నర్ సౌందర రాజన్ కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చినట్టుగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ గ్యాప్ రోజు రోజుకి పెరుగుతుంది. గవర్నర్ కు మంత్రులు ప్రోటోకాల్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నందున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గత అసెంబ్లీ సమావేశాల తర్వాత అసెంబ్లీ ప్రోరోగ్ కానీ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేస్తుంది. అసెంబ్లీ ప్రోరోగ్ కాకపోవడంతో ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఈ సమయంలో గవర్నర్ ప్రసంగం నిర్వహిస్తే రాజ్యాంగం ప్రకారంగా అది తప్పేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.

మరో వైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఈ మేరకు శనివారం నాడు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలుత తన ప్రసంగం ఉంటుందని ప్రకటించారని ఆ ప్రకటనలో ఆమె గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత పొరపాటున ఈ సమాచారం పంపారని ప్రభుత్వం వివరించిందన్నారు.

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చ చేసే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోందని గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన వివరించింది. 

కొంత కాలంగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కి కేసీఆర్ సర్కార్ కి అగాధం పెరుగుతుందనే ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారానికి తగినట్టుగానే ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సమయంలో సీఎం సహా మంత్రులు హాజరు కాలేదు. మేడారంలో గవర్నర్ వచ్చిన సమయంలో కూడా మంత్రులు గవర్నర్ కు స్వాగతం పలకలేదు. మేడారానికి గవర్నర్ వెళ్లే సమయంలో హెలికాప్టర్ కావాలని కోరినా కూడా ప్రభుత్వం నుండి స్పందన రాలేదని ప్రచారం సాగుతుంది. దీంతో గవర్నర్ రోడ్డు మార్గంలోనే మేడారానికి వెళ్లారు.