Asianet News TeluguAsianet News Telugu

బాబు-ఉత్తమ్ భేటీ: ఎన్నికల వ్యూహంపై చర్చ

తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు  ఆదివారం నాడు గంటకు పైగా సమావేశమయ్యారు

uttam kumar reddy meeting with chandrababunaidu
Author
Hyderabad, First Published Dec 2, 2018, 2:42 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు  ఆదివారం నాడు గంటకు పైగా సమావేశమయ్యారు.  ఈ ఎన్నికల్లో  టీఆర్ఎస్ ను ఓడించేందుకు అననుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు గాను  టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు పీపుల్స్ ఫ్రంట్ గా ఏర్పడ్డాయి.  ఈ కూటమి తరపున  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడులు ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 

డిసెంబర్ 1వ తేదీ నుండి చంద్రబాబునాయుడు  హైద్రాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఆదివారం నాడు చంద్రబాబునాయుడు తన నివాసంలో  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో గంటకు పైగా సమావేశమయ్యారు. 

తెలంగాణలోని ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారంలో ఏ రకమైన పరిస్థితి ఉంది... టీఆర్ఎస్ బలం, కూటమి బలం ఎలా ఉందనే విషయాలపై  చర్చించారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ ఇద్దరూ నేతలు చర్చించారు. టీడీపీ సీనియర్లు రావుల చంద్రశేఖర్ రెడ్డి,  మండవ వెంకటేశ్వరరావులు  కూడ చంద్రబాబునాయుడుతో చర్చించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios