Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు: ఉత్తమ్

అపద్ధర్మ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. తన జీవితంలో కేసీఆర్ వంటి నియంతను చూడలేదని దుయ్యబుట్టారు. దళితులపై  కేసీఆర్ కుటుంబం నేరుగా దాడి చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కేబినెట్‌లో ఒక్కరు కూడా దళిత మంత్రి లేరని విమర్శించారు.  

uttam kumar reddy fires on kcr
Author
Hyderabad, First Published Sep 24, 2018, 7:26 PM IST

హైదరాబాద్: అపద్ధర్మ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. తన జీవితంలో కేసీఆర్ వంటి నియంతను చూడలేదని దుయ్యబుట్టారు. దళితులపై  కేసీఆర్ కుటుంబం నేరుగా దాడి చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కేబినెట్‌లో ఒక్కరు కూడా దళిత మంత్రి లేరని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా నడుస్తోందన్నారు. 

నెరేళ్ల లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నహామీని నెరవేర్చలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రజలు నిలదీయాలన్నారు.

 రైతులకు బేడీలు వేసిన ఘనుడు కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లి తన గొయ్యి తానే తవ్వుకున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా రాష్ట్రంలో లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios