Asianet News TeluguAsianet News Telugu

ఓట్లు తగ్గడం వెనుక కుట్ర.. టీఆర్ఎస్ ఏ కార్యక్రమం పెట్టినా తుస్సే: ఉత్తమ్

తెలంగాణలో ఓట్లు తగ్గడం వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓట్లు తగ్గిపోతున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

uttam kumar reddy comments on trs
Author
Hyderabad, First Published Sep 4, 2018, 1:03 PM IST

తెలంగాణలో ఓట్లు తగ్గడం వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓట్లు తగ్గిపోతున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

7వ తేదీన రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో ఉన్న పీసీసీ నేతలు ప్రజలతో సమావేశమై ఓటర్ల జాబితా తారుమారు అవ్వడంపై చర్చించుకోవాలని.. అలాగే 9వ తేదీన మండల, డివిజన్ స్థాయిల్లో ఉన్న నేతలు ఓటర్ల జాబితాపై భేటీ అవ్వాలని ఉత్తమ్ కుమార్ పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘం ముంగిట కొన్ని డిమాండ్లు ఉంచారు. తెలంగాణలో ఓటర్ల జాబితా తారుమారు అవ్వడంపై దృష్టి పెట్టాలని.. ఈవీఎం మెషిన్ల తరలింపు ప్రక్రియను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించరాదని.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రలో కలిపిన ఏడు మండలాలకు చెందిన ప్రజల ఓట్ల డిలిమేటేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల్లో గెలుపొందడానికి టీఆర్ఎస్ ఎంతటి నీచానికైనా దిగజారుతుందని.. గతంలో జరిగిన సంఘటనలు ఇందుకు ఉదాహరణలని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నామరూపాల్లేకుండా పోతుందని ఉత్తమ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios