శంషాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులు పలు నినాదాలు చేశారు. శిక్షణకు విచ్చేసిన వారు వేదిక వద్దకు రాకుండా కార్యకర్తల మధ్యన కూర్చున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించడం మొదలుపెట్టగానే  కోమటిరెడ్డి అనుచరులు పెద్దపెట్టున నినాదాలు ఇచ్చారు. అనంతరం తన అనుచరులతో కలిసి కోమటిరెడ్డి బ్రదర్స్ బయటకు వెళ్లిపోయారు. అయితే, శిక్షణా శిబిరానికి కోమటిరెడ్డి బ్రదర్స్ వచ్చినా వేదిక పైకి పిలవకపోవడం తో కార్యకర్తల నడుమే కూర్చున్నా రని కొంతమంది తెలిపారు. వారు అలా దాదాపు రెండు గంటల సేపు వేచి చూశారని, తర్వాత  వెళ్ళిపోయారని వారు చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వెళ్ళిపోయే సమయంలో ఉత్తమ్ హఠావో కాంగ్రెస్ బచావో అని వారి అనుచరులు పెద్దఎత్తున నినాదాలు చేశారని వారు పేర్కొన్నారు.