రవి ఫుడ్స్‌‌ కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న తూళ్ల వీరేందర్‌గౌడ్ ప్రకటించారు. 


హైదరాబాద్: రవి ఫుడ్స్‌‌ కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న తూళ్ల వీరేందర్‌గౌడ్ ప్రకటించారు.

రవిఫుడ్స్‌తో పాటు డీఎస్ఏ లాంటి కంపెనీలపై ఐటీ అధికారులు గురువారం నాడు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల విషయమై ఆయన స్పందించారు. రవిఫుడ్సక్‌కు చెందిన ఆరుగురు డైరెక్టర్లు నేహా అగర్వల్, ప్రేరణ అగర్వాల్,కేథర్ నాథ్ అగర్వాల్, రవీందర్ కుమార్ అగర్వాల్,విమల్ అగర్వాల్. రాజేందర్ అగర్వాల్ ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

డీఎస్ఏ బిల్డర్స్‌ సంస్థను టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కొడుకులు ఉన్నారని సమాచారం. అయితే ఇటీవలనే దేవేందర్ గౌడ్ ముగ్గురు కొడుకులు ఈ సంస్థ నుండి వైదొలిగారు.

రవి ఫుడ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తూళ్ల వీరేందర్ గౌడ్ ప్రకటించారు. తనపై ఐటీ దాడులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.తూళ్ల దేవేందర్ గౌడ్ బోస్టన్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. అతను ఒక వ్యాపారవేత్తగా నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ప్రకటించారు.తనకు రూ.55.79 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ఉప్పల్ టీడీపీ అభ్యర్ధి వీరేందర్ గౌడ్‌‌కు ఐటీ దాడుల సెగ