హైదరాబాద్:హైద్రాబాద్ బోరబండ సమీపంలోని సున్నం చెరువులో గుర్తు తెలియని మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ముఖం గుర్తుపట్టకుండా ఉంది. మహిళను హత్య చేసి చాలా రోజులై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

చెరువులో మృతదేహం తేలడాన్ని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ మృతదేహం ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉంది. కాళ్లు, ముఖం మినహా ఇతర శరీర భాగాలకు ప్లాస్టిక్ కవర్ చుట్టారు. అంతేకాదు కాళ్లు, చేతులు సన్నని వస్త్రంతో కట్టేసి ఉన్నాయి.

మృతదేహంపై బలమైన గాయం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మహిళ వయస్సు 30 నుండి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ కుడిచేతిపై ఎస్ అనే అక్షరంతో టాటూ ముద్రించి ఉంది. 

మృతదేహం ఉబ్బిపోయి ఉంది. దీన్ని చూస్తే మహిళను హత్య చేసి చాలా రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.టాటూ ఆధారంగా మహిళను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

ఈ మహిళకు సంబంధించిన వారెవరైనా ఉంటే సనత్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.