పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో యువతిపై  కర్రతో దాడి.. నోట్లో పురుగుల మందు పోసిన దుండగుడు. యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత యువతి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మంథని: పెద్దపల్లి జిల్లాని మంథనిలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో దాడి చేసి నోట్లో పురుగులమందు పోశారు. యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మంథనిలో యువతిపై తలపై కర్రతో కొట్టి నోట్లో పురుగుల మందు ఎవరు పోయడం కలకలం రేపుతోంది. యువతిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో యువతిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred