టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో వుందన్నారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. శనివారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో స్మృతీ ఇరానీ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు
టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో వుందన్నారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. శనివారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో స్మృతీ ఇరానీ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ఎందుకు అధికారికంగా నిర్వహించదని ఆమె ప్రశ్నించారు. కేంద్రం అమలు చేస్తోన్న పథకాలు తెలంగాణ ప్రజలకు చేరడం లేదని స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. పేదలు, నిరుద్యోగుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. సెక్రటేరియట్‌ను కూల్చేశారని.. కొత్త ఇల్లు కట్టుకున్నారని స్మృతీ ఇరానీ ధ్వజమెత్తారు.
