వివాదాలకు దూరంా ఉండేవారు: కృష్ణంరాజు సంతాప సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

సినీ నటుడు కృష్ణంరాజు సంతాపసభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  ఇవళ పాల్గొన్నారు. చాలా ఏళ్లుగా తనకు కృష్ణంరాజుతో మంచి సంబంధాలున్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతకుముందు కృష్ణంరాజు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.
 

 Union minister Rajnath Singh participates in Krishnam Raju Condolence meeting

హైదరాబాద్: వివాదాలకు కృష్ణంరాజు దూరంగా ఉండేవారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణం రాజు సంతాపసభను శుక్రవారం నాడు హైద్రాబాద్ లో నిర్వహించారు.ఇటీవల అనారోగ్య కారణాలతో కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఆయన సంతాప సభను నిర్వహించారు. ఈ సంతాపసభలో  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిధిగా  పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్  కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కృష్ణంరాజు సతీమణితో పాటు పిల్లలు, సినీ నటుడు ప్రబాస్ ను పరామర్శించారు. కృష్ణంరాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.  అనంతరం సంతాపసభలో ఆయన పాల్గొన్నారు.  కృష్ణంరాజును తాను అన్న అని పిలిచేవాడినని రాజ్‌నాథ్ గుర్తు చేసుకన్నారు. చాలా ఏళ్ళుగా తనకు ఆత్మీయుడగా కృష్ణంరాజు ఉన్నాడని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. గోహత్య నిషేధంపై పార్లమెంట్ లో  తొలిసారిగా బిల్లు ప్రవేశ పెట్టింది కృష్ణంరాజు అనే విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

సినీ , రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు మచ్చలేని వ్యక్తి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కృష్ణంరాజుతో మంచి అనుబంధం ఉందన్నారు. మర్యాదకి కృష్ణంరాజు మారుపేరని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కృష్ణంరాజు మంచితనం ప్రబాస్ కు వచ్చిందని ఆయన చెప్పారు. ఫిల్మ్ నగర్ లో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios