కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ బుధవారం భదాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ బుధవారం భదాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం రాత్రి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మంత్రి బస చేయనున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు కొత్తగూడెంలోని ఇల్లందు గెస్ట్ హౌస్‌కు జిల్లాకు చేరుకుంటారు. అక్కడ రీప్రెష్ అయిన తర్వాత ఉదయం 10.30 గంటలకు త్రి ఇంక్లైన్‌లోని ప్రభుత్వ ఐటీఐలోని నైపుణ్య శిక్షణ హబ్‌కు మంత్రి సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

అనంతరం 12 గంటలకు ఆకాంక్షిత జిల్లా పారామీటర్‌కు సంబంధించిన అంశాల తీరుపై కలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అభివృద్ధి ప్రాజెక్టులను మంత్రి సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఇల్లందు గెస్ట్ హౌస్‌లో మధ్యాహ్న భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పలు కార్యాక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళతారు. రాత్రి 8.50 గంటలకు గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.