Kishan Reddy: 'సీఎం కేసీఆర్‌కు వత్తాసు పలికితే మంచివాళ్లు.. లేదంటే చెడ్డవాళ్లా?'
Kishan Reddy: నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ సరైన నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాస్తవానికి ఈ కోటా కింద కవులు, కళాకారులు, సామాజిక సేవ కార్యక్రమాలు చేసి వారికి గవర్నర్ అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ తిరస్కరించింది. గత కొన్ని రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫారసులను గవర్నర్ తమిళసై తిరస్కరించడం చర్చనీయంగా మారింది. అధికార పార్టీ నేతలు గవర్నర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా గవర్నర్ నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
గవర్నర్ నిర్ణయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. వాస్తవానికి ఈ కోటాలో కవులు కళాకారులు సామాజిక సేవ కార్యక్రమాలు చేసి వారికి గవర్నర్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం క్రిమినల్ కేసులు ఉన్న వారిని ఎంపిక చేసి వారి పేర్లను పంపారని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ తన కుటుంబం కోసం పనిచేసే వారికి మాత్రమే ఎమ్మెల్సీ పదవులు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి వత్తాసు పలికితే మంచివారు.. లేదంటే చెడ్డవాళ్లా? అని ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయింపుకు పాల్పడి, కెసిఆర్ కుటుంబం కోసం పనిచేసేవారిని గవర్నర్ తిరస్కరించడం సరైన నిర్ణయం అని అన్నారు. గవర్నర్ కోటా కింద కవులు కళాకారులు సామాజిక సేవ చేసే వారికి అవకాశం కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ క్రమంలో సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు పీఎం మోడీ ఎంపీగా అవకాశం కల్పించారని, అలాగే క్రీడారంగంలో పరుగుల రాణిగా పేరుగాంచిన పి.టి. ఉషాను రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ చేశారని గుర్తు చేశారు. గవర్నర్ తనకున్న అధికారాలతో న్యాయపరమైన నిర్ణయం తీసుకుందని అందుకే ఎమ్మెల్సీలను తిరస్కరించారని అన్నారు