Asianet News TeluguAsianet News Telugu

మెట్రోపై కిషన్ రెడ్డి సమీక్ష:ప్రోటోకాల్ అంశం లేవనెత్తిన బీజేపీ

మెట్రో రైలుపై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈనెల 15వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 7వ తేదీన జేబీఎస్ నుండి ఏంజీబీఎస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ ను పాటించలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

union minister Kishan reddy to review metro train in hyderabad on feb 15
Author
Hyderabad, First Published Feb 14, 2020, 6:43 PM IST

హైదరాబాద్: జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో  రైలు ఓపెనింగ్ ప్రోటోకాల్ పాటించలేదని  బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి  ప్రోటోకాల్  ప్రకారంగా ఆహ్వానం అందలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

మెట్రో రైలు అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం నాడు సమావేశం కానున్నారు. ఈ తరుణంలో బీజేపీ నేతలు ఈ విషయాన్ని లేవనెత్తడం  చర్చకు దారి తీస్తోంది. ప్రకారం ఆహ్వానం అందలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వాపోతున్నారు. మెట్రో పేరంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్సీ రామచందర్ రావు వ్యాఖ్యలు చేశారు.

Also read:జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభం: హైద్రాబాద్ రికార్డు ఇదీ

ఈ నెల 7వ తేదీన జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ మెట్రో రైలును సీఎం కేసీఆర్ ప్రారంభించారు..పార్లమెంటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రికి తెలియకుండా ఎలా ప్రారంభోత్సవాలు పెట్టుకుంటారని  బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై వారం రోజుల తర్వాత బీజేపీ నేతలు స్పందించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ నెల 15వ తేదీన దిల్‌కుషా అతిథి గృహంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో రైలుపై అధికారులతో కిషన్ రెడ్డి   సమీక్ష నిర్వహించనున్నారు.
ప్రారంభోత్సవానికి హాజరుకాకపోవడం తో మెట్రో అధికారులతో పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.

మెట్రో నిర్మాణం లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నా మెట్రో అధికారులు వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు సీరీయస్.గా వున్నారు.స్వయంగా కేంద్ర మంత్రికే ఈ పరిస్థితి ఎదురు కావడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios