Asianet News TeluguAsianet News Telugu

వరి కొనుగోలు.. మాట మార్చింది తెలంగాణ ప్రభుత్వమే, బీజేపీని దోషిని చేస్తోంది : కేసీఆర్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

ధాన్యం సేకరణపై (paddy procurement) తెలంగాణ ప్రభుత్వం (telangana govt) ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) . ధాన్యం సేకరణలో ఎందుకు మాట మారుతోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీని ఈ విషయంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. 

union minister kishan reddy slams cm kcr over paddy procurement
Author
Hyderabad, First Published Nov 27, 2021, 5:46 PM IST

ధాన్యం సేకరణపై (paddy procurement) తెలంగాణ ప్రభుత్వం (telangana govt) ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో ఎందుకు మాట మారుతోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీని ఈ విషయంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ రోజు పలు వస్తువులపై ధరలు తగ్గాయని.. కానీ కేసీఆర్ ఫ్యామిలీ తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

కేసీఆర్ (kcr) కుటుంబ, నియంతృత్వ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని ఆయన జోస్యం చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఫెర్టిలైజర్ ధర పెరిగినా రైతులపై ప్రభావం పడకుండా చేశామన్నారు. ఎఫ్‌సీఐ ధాన్యం  కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కవులు, కళాకారులపై ప్రభుత్వం కత్తి కట్టిందని.. బాయిల్డ్‌రైస్‌పై (boiled rice) గత మూడు , నాలుగేళ్లుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఈ సంవత్సరం బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని ఆయన ఆరోపించారు. 

ALso Read:Paddy procurement in telangana: తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరిస్తామన్న కేంద్రం..

కాగా... తెలంగాణలో ధాన్యం సేకరణకు (paddy procurement in telangana) సంబంధించి టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు పోటాపోటీగా ధర్నాలు కూడా చేపట్టాయి. కేంద్రందే తప్పని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఆరోపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని బీజేపీ మండిపడుతుంది. తాజాగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను (Piyush Goyal) తెలంగాణ మంత్రుల బృందం శుక్రవారం కలిసిన సంగతి తెలిసిందే. 

ఇక, శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి (Niranjan Reddy)  నేతృత్వంలో పలువరు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొమేష్ కుమార్.. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ ఘోయల్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఎంతో ఆశతో తాము ఢిల్లీ వచ్చామని.. కానీ తమకు నిరాశే ఎదురైందని అన్నారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో వరి పంటను వేయనివ్వవద్దని కేంద్ర మంత్రి గట్టిగా చెప్పారని అన్నారు. 

‘సీఎం కేసీఆర్‌ రెండునెలల క్రితం ధాన్యం కొనుగోలుపై చర్చలు జరిపి, అన్ని అంశాలను కొలిక్కి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రితో చర్చల్లో అంతిమంగా సానుకూల నిర్ణయం వస్తదని ఆశించాం. కానీ రెండుసార్లు జరిగిన సమావేశాల్లో ఆశాజనకంగా ఇచ్చిన హామీ ఏమీలేదు. యాసంగి వరి విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులే గందరగోళం చేశారని గుర్తుచేయగా.. వాళ్లు తెలిసో తెలియకో మాట్లాడారని, అలా మాట్లాడొద్దని తమవాళ్లను వారించామని కేంద్రమంత్రి చెప్పారు’ అని నిరంజన్ రెడ్డి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios