అధికారాన్ని అప్పగిస్తే ప్రజల సంక్షేమం కోసం పాలన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తమను ఆశీర్వదించి అధికారాన్ని అప్సగిస్తే ప్రజల సంక్సేమం కోసం పాలనను సాగిస్తామని కేంంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైద్రాబాద్ లో బీజేపీ విజయ సంకల్ప్ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.
హైదరాబాద్: తమను ఆశీర్వదించి అధికారాన్ని అప్పగిస్తే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాలనను సాగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
హైద్రాబాద్ లో బీజేపీ విజయ సంకల్ప్ యాత్రలో కేంద్ర మంత్రి kishan Reddyప్రసంగించారు. BJP సభకు వాతావరణం కూడా సహకరిస్తుందన్నారు. సమర్ధవంతమైన పాలనను కూడా అందిస్తామని చెప్పారు. నిజమైన ప్రజాస్వామ్య పాలనను అందిస్తామని కిషన్ రెడ్డి వివరించారు.
కేసీఆర్ పాలనను చూసి ఏం చేర్చుకోవాలని కిషన్ రెడ్డి అడిగారు. మజ్లిస్ పార్టీకి కీలుబొమ్మగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఏం నేర్చుకోవాలని ఆయన అడిగారు. 8 ఏళ్లుగా సచివాలయానికి నుండి రాని కేసీఆర్ నుండి ఏం నేర్చుకోవాలని కిషన్ రెడ్డి అడిగారు.
నెలకు 20 రోజుల పాటు KCR పాలన సాగిస్తున్నారని చెప్పారు. Seecretariat కూలగొట్టారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో మీ కంటే మంచి పాలనను అందిస్తామని కూడా కిషన్ రెడ్డి చెప్పారు.నీతి వంతమైన పాలనను అందించే శక్తి తమ పార్టీకే ఉందని ఆయన చెప్పారు.ఫామ్ హౌస్ , సచివాలయానికి రాని పాలనకు చరమ గీతం పాడుతామన్నారు.