తమ పార్టీ ఎమ్మెల్యేలను చూసి టీఆర్ఎస్ భయపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ఆయన తప్పు బట్టారు.
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలను చూసి TRS భయపడుతుందని, అందుకే శాసన సభ నుండి తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని కేంద్ర మంత్రి Kishan Reddyచెప్పారు.
సోమవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. Governor ప్రసంగం లేకుండా శాసనసభ Budget సమావేశాలు నిర్వహించడం సరైంది కాదన్నారు.
BJPకి చెందిన ఎమ్మెల్యేలను శాసనసభ నుండి సస్పెండ్ చేయాలని ప్రగతి భవన్ లో ముందే రాసుకొచ్చి తీర్మానాన్ని సభలో చదివారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. ఇది అన్యాయమని కిషన్ రెడ్డి చెప్పారు.
ప్రజాస్వామ్యానికి విరుద్దంగా KCR సర్కార్ నడుస్తుందని ఈ ఘటన రుజుువు చేస్తుందన్నారు. . తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ విధానాన్ని తెలుపుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలిపినా కూడా తాము వారిని సస్పెండ్ చేయలేదన్నారు. దేశమంతా పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ఎలా వ్యవహరించారో అందరూ చూశారన్నారు.
