కేసీఆర్ ను మించిన ఫాసిస్టు లేరు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
ఈటల రాజేందర్ ను తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడకుండా అడ్డుపడడం ప్రజాస్వామ్యమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ను మించిన ఫాసిస్టు మరొకరు ఉండరని ఆయన చెప్పారు.
హైదరాబాద్: కేసీఆర్ కంటే ఫాసిస్ట్ ఎవరు లేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు., మంగళవారం నాడు హైద్రాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పు బట్టారు.
ప్రజాస్వామ్యబద్దంగా అసెంబ్లీకి ఈటల రాజేందర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడే సమయంలో ఉండడం ఇష్టం లేకపోతే సభ బయట ఉండాలని కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
ఈటల రాజేందర్ ముఖం చూడడం ఇష్టం లేకపోతే అసెంబ్లీకి రావొద్దని కేసీఆర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో మాట్లాడనివ్వని చెప్పిన కేసీఆర్ కంటే ఫాసిస్ట్ ఎవరని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తారా అని కిషన్ రెడ్డి అడిగారు. ఈటల రాజేందర్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.రాజేందర్ ను అడుగడుగునా అవమానించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈటల రాజేందర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాదు ఈటల రాజేందర్ పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్ వ్యాపారాలను ,ఆస్తులను, కుటుంబాన్ని దెబ్బతీసేందకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కూడా హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో రాజేందర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యేను అసెంబ్లీలో మాట్లాడకుండా అడ్డు పడడం ప్రజస్వామ్యమా అని ఆయన ప్రశ్నించారు.
also read:స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు: తెలంగాణ అసెంబ్లీ నుండి ఈటల రాజేందర్ సస్పెన్షన్
తెలంగాణ నీ జాగీరా అని కేసీఆర్ ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు.మీరేమైనా నిజాం నవాబా అని కిషన్ రెడ్డి అడిగారు. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ వ్యవహరశైలి తెలంగాణ ప్రజలను అవమానించేదిగా ఉందన్నారు. హుజూరాబాద్ ప్రజల తీర్పును అవహేళన చేస్తున్నారని కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.