Asianet News TeluguAsianet News Telugu

దాడులతో మా విజయాన్ని ఆపలేరు: ఈటల కాన్వాయ్ పై దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భయబ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యంతోనే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ దాడి  చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.  ఎన్ని దాడులు చేసినా మునుగోడులో తమ గెలుపును ఆపలేరని ఆయన చెప్పారు.

union Minister Kishan Reddy Reacts on Attack on Etela Rajender Convoy
Author
First Published Nov 1, 2022, 5:40 PM IST | Last Updated Nov 1, 2022, 5:40 PM IST

హైదరాబాద్: దాడులతో ప్రజలను భయబ్రాంతులు చేసేందుకు  టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి చెప్పారు. మంగళవారంనాడు మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడారు.మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఈటల రాజేందర్ కాన్వాయ్ పై జరిగిన దాడిని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి తీవ్రంగా  ఖండించారు. తెలంగాణ సీఎం కేసీఆర్  రెండు రోజుల క్రితం నిర్వహించిన  సభలో హింసను ప్రేరేపించేవిధంగా మాట్లాడారన్నారు. ఈ వ్యాఖ్యల ఫలితంగానే ఈటల  రాజేందర్  కాన్వాయ్  పై దాడి జరిగిందని  ఆయన  అభిప్రాయపడ్డారు.

ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఈ దాడులకు  పాల్పడుతుందన్నారు. అంతేకాదుఈటల రాజేందర్  ఫోన్లతో పాటు తమ  పార్టీకి చెందిన నేతల ఫోన్లను రాష్ట్ర  ప్రభుత్వం ట్యాపింగ్  కు పాల్పడిందని ఆయన ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  కోరారు.  కానీ కొందరు పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా  వ్యవహరిస్తున్నారని ఆయన  ఆరోపించారు.మునుగోడులో విజయం సాధిస్తామని  కేంద్ర మంత్రి  కిషన్ రరెడ్డి  ధీమాను వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ,దుబ్బాకలో వచ్చిన ఫలితాలే మునుగోడులో కూడా వస్తాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios