సింగరేణిని ప్రైవేటీకరించం: తేల్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. బొగ్గు బ్లాక్ లను  కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ధరఖాస్తు చేసుకొంటే వెంటనే బొగ్గు బ్లాక్ లను కేటాయిస్తామన్నారు.
 

Union Minister Kishan Reddy Promises To No Privatisation Of Singareni

హైదరాబాద్: Singareni ని privatisation చేసే ప్రసక్తే లేదని  కేంద్ర మంత్రి Kishan Reddy ప్రకటించారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులతో భేటీ అయ్యారు. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని KCR గాలికి వదిలేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి  కార్మికులకు ఇళ్లు కట్టిస్తామ‌ని ఇచ్చిన హామీ ఏమైంద‌ని కిషన్ రెడ్డి  నిల‌దీశారు. సింగరేణి కార్మికుల కోసం నాలుగు  ఆస్పత్రులను కట్టిస్తామని 2016లో కేసీఆర్​ హామీ ఇచ్చారన్నారు. ఇప్పటివరకు ఒక్క Hospital కూడా నిర్మించలేదన్నారు. కేసీఆర్ తన ఎనిమిదేళ్ల పాలనలో సింగరేణి పరిరక్షణకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని  కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Coal  గనులకు సంబంధించిన దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సింగరేణికి వాటిని కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రానికి దరఖాస్తు చేసుకోవ‌డానికి సీఎం కేసీఆర్ ఎందుకు ఆల‌స్యం చేస్తున్నారో చెప్పాల‌ని  కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కోల్‌ బ్లాకుల విషయంలో కేసీఆర్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. యూపీఏ హాయాంలో కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేశారని ఆరోపించారు.ఇన్నాళ్లూ అబద్దపు ప్రచారం జరిగిందన్నారు. కేంద్ర మంత్రిగా చెబుతున్నా సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల ప్రభుత్వం కనిపించకుండా పోతుందని కిషన్​ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించిన వారిని  కేసీఆర్  కీలక పదవుల్లో నియమించారన్నారు.. ఉద్యమంలో పోరాడిన వారందరూ క‌నుమ‌రుగ‌య్యారని విమ‌ర్శించారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన  అమర వీరుల కుటుంబాలను సీఎం విస్మ‌రించారన్నారు.. తెలంగాణ వస్తే దళితున్ని సీఎంను చేస్తాన‌న్న కేసీఆర్​.. వచ్చే ఎన్నికల్లోనైనా మాట నిల‌బెట్టుకుంటాడా..? లేదా..? నిల‌దీశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios