భవిష్యత్తులో తెలంగాణలో మంచి పాలన: ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి ఫ్యామిలీ

సికింద్రాబాద్  ఉజ్జయిని  మహంకాళి  అమ్మవారికి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు  ఇవాళ బోనం సమర్పించారు.  దేశప్రజలంతా  సుఖ, సంతోషాలతో  ఉండాలని  కోరుకున్నట్టుగా   కిషన్ రెడ్డి  చెప్పారు. 
 

Union Minister Kishan Reddy Offers Prayers at ujjaini mahakali Temple in Secunderabad lns

హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో కూడ మంచి పాలన వస్తుందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం  చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  కుటుంబ సభ్యులు  ఆదివారం నాడు బోనం సమర్పించారు.  ఈ సందర్భంగా  కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి మీడియాతో మాట్లాడారు.ప్రతి ఏటా మాదిరిగా  ఆషాడమాసం  సందర్భంగా  బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామన్నారు. 
 
 హైద్రాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల నుండి  భక్తులు ఉజ్జయిని అమ్మవారిని  దర్శించుకొనేందుకు వస్తుంటారన్నారు. బోనాలను పురస్కరించుకొని 
  అమ్మవారిని  భక్తులు అత్యంత  భక్తి శద్ర్ధలతో అలంకరించుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.  ప్రకృతి వైపరీత్యాలు లేకుండా  దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురవాలని  అమ్మవారిని కోరుకున్నట్టుగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  తెలిపారు.  అంతేకాదు దేశ వ్యాప్తంగా మంచి వర్షాలు కురవాలని  అమ్మవారిని కోరుకున్నానని  ఆయన  తెలిపారు.   మంచి పంటలు,  , పాడి పంటలతో  ప్రజలంతా  సుఖ సంతోషాలతో ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆకాంక్షించారు. 

 

తెలంగాణ రాష్ట్రం కూడ అన్ని రంగాల్లో ముందుకు సాగాలని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  కోరుకున్నారు. ఈ విషయమై  మహంకాళి అమ్మవారు ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్టుగా  కిషన్ రెడ్డి తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios